Mahanati Telugu Movie Review
తెలుగు సినిమా రివ్యూ
సినిమా : మహానటి
జానర్ : డ్రామా [బయోపిక్]
నటి నటులు : కీర్తి సురేష్, దుల్కర్ సల్మాన్, సమంత రూత్ ప్రభు, నాగ చైతన్య, విజయ్ దేవరకొండ, శాలినీ పండే, మోహన్ బాబు తదితరులు.
సినిమాటోగ్రఫీ : డాని సంచేజ్-లోపేజ్
ఎడిటింగ్ : కోటగిరి వెంకటేశ్వర రావు
సంగీతం : మిక్కి జే మేయర్
నిర్మాత : వైజయంతి మూవీస్ & స్వప్న సినిమాస్
రచన & దర్శకత్వం :నాగ్ అశ్విన్
సినిమా రివ్యూ :
మహానటి సావిత్రి గారి బయోపిక్. 1981 లో మద్రాస్ లో ప్రజావాణి పత్రిక లో పని చేస్తున్న మధురవాణి కి అప్పటికే కోమ లోకి వెళ్ళిన మహానటి సావిత్రి గారి గురించి వార్త పత్రిక[ప్రజావాణి] లో రాయాల్సి వస్తుంది. విజయవాడ కి చెందిన సావిత్రి గారు సినిమాల్లో నటించాలని తన పెద్దనాన్న కే.వి చౌదరి గారితో మద్రాస్ కి వస్తుంది. అప్పటికే పెళ్లి అయిన సహా నటుడు జెమినీ గణేషన్ తో ప్రేమలో పడి రెండో పెళ్లి చేసుకుంటుంది సావిత్రి.
తర్వాత ఆమె సినిమా జీవితం, అలాగే వైవాహిక జీవితం ఎలా సాగింది…?
సావిత్రి గారు మందుకు బానిస అయ్యి కోమాలోకి వెళ్ళడానికి కారణాలు ఏంటి..?
ప్లస్ పాయింట్స్ : దర్శకుడు నాగ్ అశ్విన్ గారు సినిమా ని చాలా బాగా తీసారు. కీర్తి సురేష్ సావిత్రి గారి లాగ దుల్కర్ సల్మాన్ జెమినీ గణేషన్ లాగ చాలా బాగా చేసారు. మిగతా వారు వాళ్ళ పాత్రలకి న్యాయం చేసారు.ముఖ్యంగా క్లైమాక్స్ లో కీర్తి సురేష్ అండ్ సమంత నటన చాల బాగా ఉంది. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్, మిక్కి జే మేయర్ సంగీతం సినిమాకి ప్రాణం పోసింది. ఈ సినిమా నిజం గా సావిత్రి గారికి ఒక గొప్ప నివాళి.
మైనస్ పాయింట్స్ : 1st హాఫ్ లో అక్కడక్కడ బోర్ కొడుతుంది.
ఓవర్ అల్ రివ్యూ : ఒక గొప్ప నటి గానే కాకుండా, మంచి వ్యక్తి యొక్క కథ ఇది మన మహానటి సావిత్రి గారి కథ, కచ్చితంగా చూడాల్సిన కథ.
రేటింగ్ : 8.5/10
ఫ్యామిలీ తో కలిసి : చూడొచ్చు.
OTT Platform = Amazon Prime
0 Comments